* సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం
ఆకేరున్యూస్, హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు కొత్త చీఫ్ జస్టిస్‌గా అపరేష్ కుమార్ సింగ్ (ఏకే సింగ్) పేరును కొలిజియం సిఫార్సు చేసింది. అపరేష్ కుమార్ ప్రస్తుతం త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. ఇక ప్రస్తుత తెలంగాణ హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఉన్న సుజయ్ పాల్‌ను కలకత్తా హైకోర్టుకు బదిలీ చేస్తూ కొలిజియం సిఫార్సు చేసింది. అపరేష్ కుమార్ సింగ్ 1965, జూలై 7న జన్మించారు. ఢల్లీి విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ పట్టా పొందారు. 1990 నుంచి 2000 వరకు పాట్నా హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. ఆ తరవాత 2001లో జార్ఖండ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. 2012, జనవరి 24న జార్ఖండ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2021 ఏప్రిల్ నుంచి జార్ఖండ్ రాష్ట్ర న్యాయ సేవల అథారిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా అపరేష్ కుమార్ నియమితులయ్యారు. ఇక 2022 నుంచి 2023 వరకు జార్ఖండ్ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 2023, ఏప్రిల్ 17న త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా అపరేష్ కుమార్ సింగ్ పదోన్నతి పొందారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
