* జెండా ఊపి ప్రారంభించిన పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
* ఏడు రోజుల పాటు నగరంలో పలుచోట్ల కవాతులు
* ప్రజల్లో ధైర్యం నింపడమే లక్ష్యం
ఆకేరున్యూస్ , హన్మకొండ: ప్రజల్లో ఆత్మ స్థైర్యం నింపి శాంతి భధ్రతలపై భరోసా కల్పించడానికి పోలీస్ శాఖ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది. కేంద్ర హోం శాఖ ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నగరంలో పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహించనున్నారు.ప్రజలకు ధైర్యాన్ని కలిగించాటానికే ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు నిర్వహిస్తున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ తెలిపారు.ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతును పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. హన్మకొండ బస్టాండ్, బ్రాహ్మణ వాడ, అలంకార్ జంక్షన్, హన్మకొండ చౌరస్తా మీదుగా అశోక జంక్షన్ వరకు ఈ కవాతు కొనసాగినది. ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏడు రోజుల పాటు జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ కవాతు ముఖ్య ఉద్దేశం ఎలాంటి అల్లర్లు, మత ఘర్షణ లు తలెత్తిన తక్షణమే స్పందించి స్థానిక పోలీసులకు సహకారం అందిస్తూ ప్రజలకు ప్రజలకు శాంతి భద్రతలపై భరోసా కల్పించడమే లక్ష్యంగా ఈ కవాతు నిర్వహిస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, ఆర్. ఏ. ఎఫ్ డిప్యూటీ కామాండెంట్ సరస్వతి, హన్మకొండ ఏసీపీ నర్సింరావు, ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ, ఇన్స్ స్పెక్టర్లు సతీష్,రవికుమార్, సత్యనారాయణ రెడ్డితో పాటు ట్రాఫిక్, ఇతర పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
