* ఈటలతో హరీష్‌రావు రహస్య భేటీ
* కమిషన్ ముందు ఒక్కటే సమాధానం చెప్పాలని నిర్ణయం
* కేసీఆర్ ఆదేశాలతోనే ఈటెలతో హరీష్ భేటీ
* ట్రంప్ ఒత్తిడితో పాక్‌తో యుద్దం విరమించడం దారుణం
* పిసిసి చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
ఆకేరున్యూస్, హైదరాబాద్: కాళేశ్వరం కమిషన్ విషయంలో అంత ఒకటే సమాధానం చెప్పాలని హరీష్ రావు, ఈటెల రాజేందర్ అవగాహనకు వచ్చారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు షామిర్ పేటలో రహస్యంగా కలిశారని అన్నారు. గాంధీభవన్‌లో ఏర్పాటుచేసిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఒక ఫామ్ హౌస్‌లో సీక్రెట్‌గా కలిశారని ఆరోపించారు. కేసీఆర్ చెప్పారు కాబట్టే హరీష్, ఈటల కలిశారన్నారు. కాళేశ్వరం కమిషన్ విషయంలో అంత ఒకటే సమాధానం చెప్పాలని మాట్లాడు కున్నారన్నారు. ఈ అంశంపై ఈటల రాజేందర్ సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే అని వందసార్లు చెప్పామన్నారు. కవిత బీజేపీ విూద సర్జికల్ సర్జికల్ స్ట్రయిక్ చేస్తోందని.. దానిపై బీజేపీ సమాధానం చెప్పాలన్నారు. భాజపా, భారాస సయోధ్య గురించి కవిత ఇప్పుడు బయటపెడుతున్నారు. బండి సంజయ్‌ను భాజపా అధ్యక్ష పదవి నుంచి అన్యాయంగా తొలగించలేదా? భారాసతో దోస్తీకి అడ్డుగా ఉన్నందుకే సంజయ్‌ను తొలగించింది వాస్తవం కాదా? బీజేపీ నేతల ప్యాకేజీల గురించి రాజాసింగే చెబుతున్నారు. రాజాసింగ్ మాటలకు ఆ పార్టీ పెద్దలు సమాధానం చెప్పాలి. షావిూర్పేటలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఈటల రాజేందర్, హరీశ్‌రావును కలిశారు. ఇద్దరూ కలిసి కేసీఆర్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. ఈటల రాజేందర్.. మోదీ పార్టీలో ఉన్నారా?కేసీఆర్ పార్టీలో ఉన్నారా? కాళేశ్వరం స్కామ్ నుంచి బయటపడేందుకు ఈటల.. కేసీఆర్‌తో చేతులు కలుపుతున్నారని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆరోపించారు. కాళేశ్వరం కమిషన్ కేసీఆర్‌కు ఏటీఎంలా మారిందని ఆనాడు జేపీ నడ్డా ఆరోపించారు. ఆ ఆరోపణలను ఈటల నిజం చేస్తారా? లేక కేసీఆర్‌తో ఉన్న పాత దోస్తీతో అబద్ధాలు చెప్తారా? ఈటల బీజేపీ మనిషా.. ఎవరి మనిషో విచారణ రోజు బయటపడుతుందన్నారు. కాళేశ్వరం కమిషన్ ముందు ఈటల వాస్తవాలు చెప్పాలి. దొంగలుదొంగలు ఊర్లు పంచుకున్నట్లు చేశారని మహేశ్ కుమార్ గౌడ్ విమర్శించారు.భారత్- పాక్ అంశపై స్పందించారు. పాక్‌పై యుద్ధం సరిగా చేయక ట్రంప్‌కు భయపడి.. విరమించుకున్నారని ఆరోపించారు. ట్రంప్ తలదూర్చేందుకు ఎందుకు అవకాశం ఇచ్చారో సమాధానం చెప్పాలన్నారు. యుద్ధంలో సాధించింది ఏంటి? కోల్పోయింది ఏంటి? చెప్పే బాధ్యత కేంద్రం విూద లేదా? అని ప్రశ్నించారు. సమాధానం చెప్పాల్సింది పోయి రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారని.. ఇందిరమ్మ గొప్పతనం పార్లమెంట్ రికార్డ్స్ చూసి కిషన్ రెడ్డి మాట్లాడాలని కాంగ్రెస్ చీఫ్ మహేష్‌గౌడ్ అన్నారు. ఇందిరమ్మ అసలు సిసలైన ఉక్కుమనిషి అని కొనియాడారని… సర్జికల్ స్ట్రయిక్ సీక్రెట్ దాన్ని కూడా బీజేపీ నాయకులు రాజకీయాల కోసం బయటకి చెప్తున్నారన్నారు. సర్జికల్ స్ట్రయిక్ చేసి గొప్పలు చెప్పుకొంటున్నారు.. అప్పట్లో ఇందిరా గాంధీ వందల కొద్దీ సర్జికల్ స్ట్రయిక్ చేసినా ఏనాడూ చెప్పుకోలేదని మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు.. ఇందిరాగాంధీ గొప్పతనాన్ని ఆనాడు వాజ్‌పేయీ కూడా గుర్తించి.. అపర కాళీ అని మెచ్చుకున్నారని గుర్తు చేశారు. అసలు ఇందిరాగాంధీకి.. మోదీకి పోలిక ఏంటని ప్రశ్నించారు. భారత్-పాక్ యుద్దం ఎందుకు ఆపారో చెప్పాలని డిమాండ్ చేశారు యుద్ధానికి తాము సంపూర్ణ మద్దతిచ్చామని చెప్పారు. యుద్దం వాస్తవాలేంటో ప్రజలకు చెప్పాల్సిన అవసరం కేంద్రంపైన ఉందన్నారు. రాహుల్ పై విమర్శలు చేయడం సిగ్గుచేటన్నారు.
………………………………………….
