Harish Rao Praises Dr Mamatha who saved Peddi Sudarshan Reddy
* పెద్ది ప్రాణాలు కాపాడిన డాక్టర్ మమతపై హరీశ్‌రావు ప్రశంసలు
ఆకేరు న్యూస్, హుజురాబాద్:
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర గుండెపోటుకు గురికాగా, 9 సార్లు సీపీఆర్ (CPR) చేసి ఆయన ప్రాణాలను నిలబెట్టిన డాక్టర్ మమతారెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్‌రావు సామాజిక మాధ్యమాల వేదికగా ప్రశంసల వర్షం కురిపించారు.
గుండె ఆగిపోయినప్పటికీ ఆశ వదులుకోకుండా, ఎంతో ఒత్తిడిలోనూ అసమాన ధైర్యసాహసాలు, వైద్య నైపుణ్యంతో పోరాడి సుదర్శన్‌రెడ్డికి డాక్టర్ మమత పునర్జన్మ నిచ్చారని హరీశ్‌రావు కొనియాడారు.
ప్రాణదాతగా నిలిచిన ఆమె అంకితభావం వైద్య వృత్తికే స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెద్ది సుదర్శన్‌రెడ్డి త్వరగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని హరీశ్‌రావు ఆకాంక్షించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
