కల్వకుంట్ల కవిత
* రేవంత్ రెడ్డికి లేఖ రాసిన కవిత
* జీహెచ్ ఎంసీలో అక్రమాలపై నిలదీత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ కవిత లేఖ రాశారు. జీహెచ్ఎంసీలో ఎమర్జెన్సీ బృందాల టెండర్లు రద్దు చేయాలని లేఖలో కోరారు. వర్షాకాలంలో చేపట్టే ఎమర్జెన్సీ పనుల టెండర్లలో కొందరు అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు. ఓ విదేశీ సంస్థకు చెందిన వాహనాలనే పనులకు ఉపయోగించేలా టెండర్లు రూపొందించారని, 2 కాంట్రాక్ట్ ఏజెన్సీలకు లబ్ది చేకూరేలా చేశారని ఆరోపించారు. తెలంగాణ కాంట్రాక్టర్లకు నష్టం జరుగుతోందన్నారు. వార్డుల వారీగా టెండర్లు పిలవాలని డిమాండ్ చేశారు.
…………………………………………
