* 2300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత
* మళ్లీ బాలికలదే పైచేయి
* తొలి స్థానంలో మన్యం జిల్లా
* చివరి స్థానంలో కర్నూలు జిల్లా
* ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల
ఆకేరు న్యూస్, అమరావతి :
ఏపీ టెన్త్ ఫలితాలను విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ సోమవారం ఉదయం 11 గంటల తర్వాత విడుదల చేశారు. 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 5.34 లక్షల మంది విద్యార్థులు అంటే 84.69 మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది కూడా బాలికలదే పై చేయి. 89.17 శాతం ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలికలు ఉండగా, బాలుర ఉత్తీర్ణత 84.32 శాతంగా ఉంది. ఉత్తీర్ణత సాధించిన మొత్తం విద్యార్థుల్లో 69 శాతానికిపైగా ఫస్ట్ క్లాస్ లో పాసవడం గమనార్హం. 11.9 మంది సెకండ్ క్లాస్లో పాసయ్యారు. 2300 స్కూళ్లలో 100 శాతం ఉత్తీర్ణత సాధించిగా, 17 పాఠశాలలో ఒక్కరు కూడా పాస్ కాలేదు. తొలి స్థానంలో మన్యం జిల్లా ఉండగా, చివరి స్థానంలో కర్నూలు ఉంది.
మే 24 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు
మే 24 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు. జూన్ 3 వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయని, వివరించారు. చాలా పకడ్బందీగా టెన్త్ పరీక్షలు నిర్వహించినట్లు ఆయన వివరించారు. విద్యార్థులు ఫలితాలను విద్యాశాఖ వెబ్సైట్లో చూసుకోవచ్చునని తెలిపారు.
———————————