* పోలీసుల వార్నింగ్
ఆకేరున్యూస్, హైదరాబాద్ : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో నిబంధనలు పాటించని వారిపై అలర్ట్ సీరియస్ అవుతున్నారు. లైసెన్స్ గన్లను సంబంధిత పోలీస్ స్టేషన్లలో సరెండర్ చేయాలని ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన వెంటనే ఆదేశాలు జారీ చేశారు. కానీ.. ఇప్పటి వరకు సగం మంది కూడా జమ చేయలేదని ఉన్నతాధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో గన్ లైసెన్సులు కలిగిన 4600 మంది ఆయుధాలను డిపాజిట్ చేశారు. అయితే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఆ సంఖ్య మరింత తక్కువకు చేరింది. కేవలం ఒక్క హైదరాబాదులో మొత్తం 8 వేల మందికి పైగా గన్ లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 3000 మంది మాత్రమే తమ గన్స్‌ను డిపాజిట్ చేశారు. డిపాజిట్ చేయనివారిలో చాలామంది కనీసం పోలీసులకు సమాచారం కూడా ఇవ్వడం లేదు. కాగా, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువ గన్ లైసెన్స్ హోల్డర్లు ఉన్నారు. ఒక్క బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 894 గన్ లైసెన్సీలు ఉన్నాయి. మరోవైపు బ్యాంకు సిబ్బంది కూడా గన్స్‌ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అయితే క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసులకు దీని నుండి మినహాయింపు ఇచ్చారు.
—————————————-