
కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం
ఆకేరు న్యూస్, కర్నూలు : కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని డీజిల్ ట్యాంకర్ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లారీ కేబిన్ లో చిక్కుకుని డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు. అప్సరి మండలం చిన్నోతూరు గ్రామంలో ఈ ప్రమాదం జరిగింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నారు. పోలీసులు ప్రమాదాలకు గల కారణాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి డ్రైవర్ నిద్ర మత్తు కారణమా.., లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే దానిపై విచారణ చేపడుతున్నారు.
———————-