– జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బద్దం సుదర్శన్ రెడ్డి
ఆకేరు న్యూస్, కమలాపూర్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను నమోదు చేసి ప్రభుత్వ పాఠశాలలను పరిరక్షించుకోవాలని హనుమకొండ జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ బద్దం సుదర్శన్ రెడ్డి అన్నారు. ఆదివారం కమలాపూర్ లో టీఎస్ యుటీఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతున్న బడిబాట ప్రచార జాతా లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… ప్రైవేట్ పాఠశాలల్లో వేలాది రూపాయలు ఫీజులు కట్టి నాణ్యమైన విద్యను పొందలేకపోతున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య ఉచిత పాఠ్యపుస్తకాలు, ఉచిత నోటుబుక్కులు, పౌష్టికాహారంతో కూడిన మధ్యాహ్న భోజనం, రెండు జతల దుస్తులు, రాగి జావా ఉచితంగా అందిస్తారని అన్నారు.టీఎస్ యుటిఎఫ్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న బడిబాట ప్రచార జాతకు విశేష స్పందన వస్తోందని, ఈ మేరకు కృషి చేస్తున్న టీఎస్ యుటిఎఫ్ బాధ్యులను బద్దం సుదర్శన్ రెడ్డి అభినందించారు. కార్యక్రమంలో టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ఆడిట్ కమిటీ సభ్యుడు డి కిరణ్ కుమార్ ,హనుమకొండ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ రవీందర్ రాజు, పెండెం రాజు ,జిల్లా ఉపాధ్యక్షులు అజ్మీరా రాజారాం, జిల్లా కార్యదర్శి సిహెచ్ లింగారావు, పి చంద్రయ్య, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జీ భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.

……………………………………………….
