* ఏం జరగనుంది అనే ఉత్కంఠ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఫార్ములా-ఈ కార్ రేసు కేసు(FORMULA E-CAR RACE CASE)లో ఏ1గా ఉన్న బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఆయనతోపాటు మాజీ అదనపు అడ్వకేట్ జనరల్ రామచందర్ రావు కూడా ఉండే అవకాశం కల్పించారు. ఈ కేసులో కేటీఆర్ ను ఏసీబీ అధికారులు ఏం ప్రశ్నించనున్నారు.. ఏం జరగనుంది అనే ఉత్కంఠ ఏర్పడింది. అంతకుముందు నందీనగర్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఫార్ములా వన్ విచారణకు సంబంధించి పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. ఈ భేటీలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు కూడా పాల్గొన్నారు. అనంతరం తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్యనాయకులతో భేటీ అయ్యారు. విచారణలు, కమిషన్లు, రాజకీయ వేధింపులతో వెనక్కి తగ్గేదేలేదని, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతూనే ఉంటామని కేటీఆర్ (KTR ) అన్నారు. ఆరు గ్యారంటీల మోసాన్ని ఎండగట్టడంలో ఇవేవీ తమను ఆపలేవన్నారు. ‘మీ విచారణలు, కమిషన్లు, రాజకీయ ప్రతీకార చర్యలకు నేను ఎప్పటికీ నిరుత్సాహ పడను. 420 వాగ్దానాలు, మోసపూరిత డిక్లరేషన్లు, ఆరు గ్యారంటీల అమలులో వైఫల్యాలను ఎత్తి చూపుతూనే ఉంటాం’ అని కేటీఆర్ ట్వీట్ చేశారు. అనంతరం తెలంగాణ భవన నుంచి నుంచి బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలనికి చేరుకున్నారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
