ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ భేటీ నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanthreddy) అధ్యక్షతన సమావేశం జరగనుంది. ఇటీవలే ప్రమాణం చేసిన కొత్త మంత్రులు వివేక్ వెంకటస్వామి, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్ ఈ సమావేశంలో పాల్గోనున్నారు. వారి పరిచయ కార్యక్రమం కూడా ఉంటుంది. కొత్త మంత్రులకు వారి శాఖల బాధ్యతలు, ప్రభుత్వం లక్ష్యాలపై సీఎం దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది. కేబినెట్ (Cabinet) భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా నాలుగు అంశాలపై చర్చ జరుగుతుందని తెలుస్తోంది. రైతు భరోసా, స్థానిక ఎన్నికలు, రాజీవ్ యువ వికాసం, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు.. ఏపీ చేపట్టేందుకు సిద్ధమైన బనకచర్ల (Banakacharla) ప్రాజెక్టుపైనా క్యాబినెట్ లో చర్చ జరిగే అవకాశం ఉంది. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై క్యాబినెట్ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు, పార్టీ వ్యూహాలపై కూడా మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలా.. లేదా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలా..? అనేదానిపై మంత్రుల అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి తెలుసుకోనున్నారు.
…………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
