* డబ్బు కోసమా? డ్రైవర్‌కు, డైరెక్టర్‌కు మధ్య విభేధాలే కారణమా?
* మిస్టరీగా మారిన చిక్యాల హరీశ్ కిడ్నాప్ వ్యవహారం
ఆకేరు న్యూస్, ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ కేంద్ర సహకార బ్యాంక్ డైరెక్టర్(DCCB DIRECTOR KIDNAP), బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీశ్ కిడ్నాప్ (KIDNAP)వ్యవహారం మిస్టరీగా మారింది. ఇంట్లో నుంచే ఆయనను ఎత్తుకెళ్లడం, చాకచక్యంగా ఆయన తప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. పదేళ్ల క్రితం హరీశ్‌రావు కుమార్ వద్ద డ్రైవర్ గా పని చేస్తున్న వ్యక్తే ఈ కిడ్నాప్‌నకు సూత్రధారి అని పోలీసులు ఇప్పటికే గుర్తించినట్లు తెలుస్తోంది. అయితే డబ్బు కోసమే ఆయనను కిడ్నాప్ చేశారా? దీని వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఆదివారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో హరీష్ నిద్రపోతున్నప్పుడు దుండగులు అతన్ని అపహరించారు. వారు అతని కళ్ళకు గంతలు కట్టి, చేతులు కట్టేసి కారులో హైదరాబాద్‌కు తరలించడానికి ప్రయత్నించారని తెలుస్తోంది. అయితే, హరీష్ తూప్రాన్‌లోని టోల్ ప్లాజా వద్ద తప్పించుకుని స్థానిక పోలీసులను సంప్రదించాడు, వారు మమడలోని వారి సహచరులకు సమాచారం అందించారు.
ఆర్థిక వివాదాలే కారణమా?
కిడ్నాప్ వ్యవహారాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. హరీష్ ఆరోపణలపై ప్రాథమిక విచారణ తర్వాత మరిన్ని వివరాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. హరీష్ కి ఆర్థిక వివాదాలు కూడా ఉండవచ్చునని అనుమానిస్తున్నారు, ఇవి అపహరణకు దారితీసి ఉండవచ్చు అనే కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. హరీష్‌కు ఇంకా ఎవరితోనైనా విభేదాలు ఉన్నాయా ఆరా తీస్తున్నారు. గతంలో ఆయన దగ్గర పని చేసిన డ్రైవర్ (DRIVER)తో ఎవరైనా కిడ్నాప్ ప్రయత్నం చేశారా అనే అనుమానాలూ వ్యక్తం అవుతున్నాయి.
ఫాస్టాగ్ బ్యాలెన్స్ లేకపోవడంతో తప్పిన ముప్పు
ఇంట్లో నుంచి హరీష్‌ను కిడ్నాప్ చేసిన దుండగులు ఆదివారం 6.10 గంటలకు తూప్రాన్ టోల్ ప్లాజాకు చేరుకున్నారు. కారుకు ఉన్న ఫాస్టాగ్ (FAST TAG) బ్యాలెన్స్ లేకపోవడంతో .. ఆ కారు టోల్ దాటేందుకు సమయం పట్టింది. ఇదే అదునుగా హరీష్ చాకచక్యంగా తప్పించుకున్నారు. టోల్ గేట్ వద్ద సిబ్బందితో కొంచెం జనసమర్దం ఉండడంతో కిడ్నాపర్లు దిగకుండా అతడిని అక్కడే వదిలేసి పరారయ్యారు. అనంతరం హరీశ్ డయల్ 100కు ఫోన్ చేయడంతో పోలీసులు అక్కడకు చేరుకని ఆయనను నిర్మల్ తీసుకెళ్లారు. హరీశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డబ్బు కోసమా? డ్రైవర్‌కు, డైరెక్టర్‌కు మధ్య గతంలో విభేధాలు ఏమైనా ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
