* అధికారులకు జిల్లా కలెక్టర్ దివాకర్ ఆదేశం
* ములుగు ప్రజావాణిలో 63 ఫిర్యాదులు
ఆకేరు న్యూస్ ములుగు : ప్రజావాణి లో వచ్చిన దరఖాస్తులకు వెంటనే పరిష్కార మార్గం చూపాలని కలెక్టర్ దివాకర్ అధికారులను ఆదేశించారు. ములుగు కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.సమస్యల పరిష్కారం కోరుతూ ప్రజలు ప్రజావాణి ఆశ్రయిస్తున్నారని, వారి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అన్నారు. ప్రజావాణి పోర్టల్ లోని పెండింగ్ దరఖాస్తులను కూడా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమంలో 63 దరఖాస్తులు రాగా అత్యధికంగా గృహ నిర్మాణ శాఖకు 30, భూ సమస్యలు 17, ఉపాధి కల్పనకు 06, పెన్షన్ 01, ఇతర శాఖలకు సంబంధించినవి 09 దరఖాస్తుల స్వీకరించగా వాటిని వెంటనే సంబంధిత అధికారులకు బదిలీ చేసి పరిష్కరించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటేష్, వివిధ జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్ పరిపాలన అధికారి, పర్యవేక్షకులు, తహసీల్దార్లు, ఎం పి డి ఓ లు, ఎంపిఓ లు, తదితరులు పాల్గొన్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
