* బడి బాట ప్రేరణ వీడియో సాంగ్ ఆవిష్కరణ
ఆకేరు న్యూస్, జనగామ: ప్రతి ఒక్కరికి చదువు కావాలని అందుకు చదువుకోవాలని చదువుతూ విజ్ఞానం వికసిస్తుందని జనగామ కలెక్టర్ షేక్ రిజ్వాన్ భాషా అన్నారు. ప్రతి ఊరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యత, నాణ్యమైన విద్య , విద్యార్థుల నమోదు పెంచుటకు, విద్యా ప్రాముఖ్యతను కళ్ళకు కట్టినట్లుగా “చిన్నా కన్నా మీకు చదువేరా మిన్నా ” అంటూ రవీందర్ అల్లూరి రాసిన బడి బాట ప్రేరణ సాంగ్ ను రవీందర్, ఉపాద్యాయులు వసంత, జ్యోతి, యువన గానం చేసి, చిత్రీకరించిన వీడియో సాంగ్ ను జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్, అడిషనల్ కలెక్టర్లు పింకేష్ కుమార్, రోహిత్ సింగ్ లు ఆవిష్కరించారు. డీ ఈ ఓ భోజయ్య, ఓబుల్ కేశవాపుర్ హై స్కూల్ టీచర్ రవీందర్, పెంబర్తి హై స్కూల్ టీచర్స్ వసంత, జ్యోతి, బేబీ యువనలను కలెక్టర్ భాషా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఓబుల్ కేశవాపూర్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎన్. నర్సింహారెడ్డి, ఎంపిపిఎస్ ప్రధానోపాధ్యాయులు సురేందర్ రెడ్డి, లింగం, గణిత ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
………………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
