* అడిషనల్ కలెక్టర్ మహేందర్జీ ఆదేశం
ఆకేరున్యూస్, ములుగు : ప్రస్తుత వర్షాకాలంలో ప్రజలకు డయేరియాపై అవగాహన కల్పించాలని
అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) అధికారులకు సూచించారు. ములుగు జిల్లా కేంద్రంలో డయేరియాపై వివిధశాఖల అధికారులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను కోరారు.వర్షాకాలంలో తాగునీరు కలుషితం అయ్యే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. క్లోరినేషన్ చేసిన తరువాతనే గ్రామాల్లో నీటి సరఫరా చేయాలన్నారు. ఐదు సంవత్సరాల లోపి పిల్లలు ఉన్న ప్రతీ ఇంట్లో ఓఆర్ ఎస్ తో పాటు జింక్ టాబ్లెట్లను పంపిణీ చేయాలని వైద్య అధికారులను ఆయన కోరారు.పాఠశాల విద్యార్థులకు వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు. గర్భిణులు బాలింతలకు డయేరియాపై అవగాహన కల్పించి పిల్లలకు ఫీడింగ్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించాలని ఆయన అంగన్ వాడీ సిబ్బందికి సూచించారు. వేడి చేసి చల్లార్చిన నీటినే పిల్లలకు తాగించాలని సూచించారు. మరుగుదొడ్లను శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. వ్యక్తిగత పరిశుభ్రతను
పాటిస్తే స్టాప్ డయేరియా 2025 కార్యక్రమాన్ని విజయవంతం చేయొచ్చని ఆయన అన్నారు.పాఠశాలల్లో అంగన్వాడి సెంటర్లలో ఆశ్రమ స్కూళ్లలో, ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలలో, ఉచిత వైద్య క్యాంపులను నిర్వహిస్తూ, ఆరోగ్య సూత్రాలపై అవగాహనను పెంపొందిస్తున్నామని, అలాగే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ లలో ,ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మరియు పాఠశాలల్లో ఓ ఆర్ ఎస్ జింక్ కార్నర్లను ఏర్పాట్లు చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డెమో సంపత్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పూర్ణ సంపత్ రావు జిల్లా లైన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
