* 18మంది మృతి
* జనజీవనం అతలాకుతలం
* కొన్ని ప్రాంతాల్లో రెడ్,ఆరెంజ్ అలర్ట్
* సహాయక చర్యలు ముమ్మరం
* రహదారులపై భారీగా నిలిచిన నీరు
* రాకపోకలకు అంతరాయం
ఆకేరు న్యూస్ డెస్క్ : మహారాష్ట్రలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది.. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 18 మంది చనిపోగా 65 మంది గాయపడ్డారు
వర్షాల కారణంగా రోడ్డు ప్రమాదాలు,పిడుగుపాటుతో పాటు నీట మునిగి తదితర కారణాల వల్ల మరణాలు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ముంబైతో పాటు రత్నగిరి, రత్నగిరి, సిందుదుర్గ్, రాయ్‌గఢ్ తదితర జిల్లాల్లో భారీగా వర్షం కురిసిందని తెలిపింది. మరోవైపు పశ్చిమ మహారాష్ట్రలోని అరంజ్ అలర్ట్ జారీ చేసినట్లు పేర్కొంది. అలాగే పుణె, కోల్హపూర్, సతారాతోపాటు రాయ్‌గఢ్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరంలో రహదారులపై నీరు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది.మరో 24 గంటల్లో గుజరాత్, విదర్భ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాలోని పలు ప్రాంతాల్లో విస్తరించనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్, తూర్పు ఉత్తరప్రదేశ్‌లో మరో మూడు రోజుల్లో ఇవి విస్తరిస్తాయని పేర్కొంది. అలాగే కేరళలో..జూన్ 18 వరకు విస్తృతంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నేపధ్యంలో కేరళలోని పలు జిల్లాల్లో ప్రభుత్వం రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లు జారీ చేసింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సైతం సాధారణ వర్షాలు లేకుంటే.. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక పోతే మహారాష్ట్రలోని లోతట్ట ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.. లోతట్టు ప్రాంతంలో ఉండే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. రోగాలు ప్రబలకుండా ఆరోగ్య శాఖ
అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
