* ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్.
ఆకేరున్యూస్, ములుగు: రాష్ట్ర ప్రభుత్వం ములుగు జిల్లా లో చిన్న, సన్నకారు రైతులకు పెట్టుబడి భారం తగ్గించి, వ్యవసాయ ఉత్పాదకతను మెరుగుపరిచేందుకు రైతుభరోసా పథకం లో భాగంగా… పంట పెట్టుబడి సాయం అందిస్తున్న దని.. ఇందులో భాగంగా వానాకాలం 2025 కి సంబందించి పంట పెట్టుబడి సాయం క్రింద..జిల్లాలో 61 వేల మంది రైతు ఖాతాల్లో 48 కోట్ల రూపాయలు రైతు భరోసా నిధులు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేయడం జరిగిందని మంగళవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 86234 మంది రైతులకి గాను 103 కోట్ల నిధులు విడుదల చేయాల్సి ఉండగా 61666.( 48 కోట్లు) మంది రైతుల బ్యాంకు ఖాతా వివరాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఇప్పటికే రైతు భరోసా పోర్టల్ నందు పొందు పరచడం జరిగిందని, మిగిలిపోయినటువంటి రైతులకు వారం పది రోజులు లోపల వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతుకి రైతు భరోసా నిధులు జమ చేయబడతాయని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
