* నినదించిన వెలిశాల పల్లెలు
* మావోయిస్ట్ నేత గాజర్ల రవి అంతిమ యాత్రకు తరలి వచ్చిన జనం
ఆకేరు న్యూస్ : ( వెలిశాల నుంచి ప్రత్యేక ప్రతినిధి )
లాల్ సలాం …అమర వీరుల ఆశయాలు కొనసాగిస్తాం … నినాదాలు మారుమోగాయి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , రంపచోడవరం లోని మారేడుమిల్లి లో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు గాజర్ల రవి అలియాస్ ఉదయ్ అలియాస్ గణేష్ అంత్యక్రియలకు పెద్ద ఎత్తున జనం హాజరయినారు . భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో జరిగాయి.. ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు హాజరయి గణేష్ కు నివాళులు అర్పించారు.. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ మావోయిస్ట్ నేత గాజర్ల రవి కి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు..
హోరెత్తిన నినాదాలు :
అంతిమ యాత్ర మొదలయినప్పటి నుంచి నినాదాలతో వెళిశాల హోరెత్తింది ..పరిసర గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో కదలి వచ్చారు. భారత్ బచావో నేత గాదె ఇన్నయ్య, అరుణోదయ విమలక్క, ప్రజా సంఘాల నేతలు హాజరయినారు. విమలక్క దారి పొడుగున ఆట పాటలతో ఊరేగింపు లో ఉద్విగ్న వాతావరణాన్ని నింపింది..గుంపులుగా కళాకారులు, మాజీ మావోయిస్ట్ లు పాటలతో గాజర్ల రవికి నివాళి అర్పించారు..
————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
