* ఏపీ మాజీ సీఎంకు షర్మిల ప్రశ్నాస్త్రాలు
ఆకేరు న్యూస్, అమరావతి : రప్పా రప్పాను జగన్ సమర్థించడం దారుణమని ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల (SHARMILA) అన్నారు. నరుకుతాం, చంపుతాం, బట్టలు ఊడదీస్తామని మాజీ సీఎం జగన్ (CM JAGAN) అనడం ఏంటని ప్రశ్నించారు. రప్పా రప్పా వ్యాఖ్యలను జగన్ సమర్థించడం దారుణమైన విషయమన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉండి సమాజానికి ఆయన ఏం చెప్పదలుచుకున్నారు? జగన్ మాటలు దురదృష్టకరం. రెచ్చగొట్టే, హింసాత్మక వ్యాఖ్యలు సరికాదు. ఇ ప్పటికైనా జగన్ బుద్ధి మార్చుకోవాలని.. అని ఆమె హితవు పలికారు. బెట్టింగ్ లో ఆత్మహత్య చేసుకు న్న వాళ్ళకు జగన్ పరామర్శించడం ఏటని, జగన్ ప్రజా సమస్యల మీద పోరా టం చేయాలని… బల ప్రదర్శనలు కాదని పేర్కొన్నారు. జగన్ బీజేపీ(BJP)కి దత్తపుత్రుడు కాబట్టి.. అన్ని అనుమతులు ఇస్తున్నారని మండిపడ్డారు. దగ్గరుండి బలప్రదర్శనలు చేయిస్తున్నారని షర్మిల ఆరోపించారు. ప్రజా సమస్యల మీద పోరాటాలు చేసే కాంగ్రెస్ కి మాత్రమే ఆంక్షలు విధిస్తున్నారని చెప్పుకొచ్చారు. జగన్ పర్యటనలకు ఎందుకు ఆంక్షలు లేవో చంద్రబాబు (CHANDRABADU) సమాధానం చెప్పాలని షర్మిల డిమాండ్ చేసారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
