* బినామీల క్వారీ పనులను ప్రశ్నించినందుకే అరెస్టు
* ఆ క్వారీ ముమ్మాటికీ సీతక్క బినామీలది
* ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
ఆకేరు న్యూస్, వరంగల్ : ‘రేవంత్ రెడ్డి గారూ.. మీరు ఎన్ని కుట్రలు చేసినా తలవంచం. నిలదీస్తూనే ఉంటాం.. అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి (KOUSHIK REDDY) స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి బినామీల ద్వారా నడిపిస్తున్న క్వారీ పనులను ప్రశ్నించినందుకే తనను అరెస్ట్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసుల అరెస్ట్ పై కౌశిక్ రెడ్డి స్పందించారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా ఎయిర్‌పోర్టులోనే తనను అరెస్టు చేయడం అక్రమమని కౌశిక్ రెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నిజాయితీ తలవంచదని అన్నారు. శంషాబాద్‌లో తనను అరెస్ట్ చేసిన తీరు ప్రజాస్వామ్యంపై దాడికి సమానమని వ్యాఖ్యానించారు. ‘మీ కుట్రలు, అక్రమ కేసులతో నన్ను ఆపాలని అనుకోవడం మీ మూర్ఖత్వాన్ని, మీ అసమర్థ పాలనను, అక్రమ రాజకీయాలను చాటుతోంది. ఆ క్వారీ సీఎం రేవంత్ రెడ్డి కుటుంబంతోపాటు మంత్రి సీతక్క బినామీలది. దానివల్ల ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది కలుగుతున్నది. వారి ప్రాణాలకు ప్రమాదం ఏర్పడింది. ఇచ్చిన భూమి పరిధి దాటి అక్రమంగా వారిని నడుపుతూ ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారు. ఆ ప్రాంత ప్రజల కోసం ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉంటా’ అని పాడి స్పష్టం చేశారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
