* యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాల మద్దతు
* అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు
* ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఆకేరు న్యూస్, విశాఖపట్టణం : యోగా తో ప్రపంచ దేశాలను అనుసంధానం చేయవచ్చునని, యోగాతో అద్భుత విజయాలు సాధించవచ్చునని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (MODI) అన్నారు. అందరికీ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు తెలిపారు. విశాఖపట్టణంలో నిర్వహించిన ఇంటర్నేషనల్ యోగా డే(INTERNATIONAL YOGA DAY)లో ఆయన పాల్గొన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా డే జరుపుకుంటున్నామని, యోగా దినోత్సవ ప్రతిపాదనకు 175 దేశాలు మద్దతు ఇచ్చాయని వివరించారు. కోట్ల మంది జీవితాల్లో యోగా వెలుగులు నింపిందన్నారు. ఈ యోగాడే ప్రకృతి, ప్రగతి సమ్మేళనంలా ఉందని, యోగాడేపై మంత్రి నారా లోకేష్ (NARA LOKESH) కృషిని ప్రత్యేకంగా అభినందిస్తున్నా అన్నారు. యోగాంధ్రపై అన్నివర్గాల్లో నారా లోకేష్ చైతన్యం కల్పించారని,. యోగాంధ్ర కార్యక్రమంపై నారా లోకేష్ చాలా కృషి చేశారని కొనియాడారు. యోగాంధ్ర నిర్వహణకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు(CHANDRA BABU), ఉప ముఖ్యమంత్రి పవన్ (PAVAN) చొరవ చూపారని తెలిపారు. నేవీకి చెందిన నౌకల్లో యోగాసనాలు చేస్తున్నారని, గ్రామాల్లో యువకులు యోగాను అనుసరిస్తున్నారని వివరించారు. ప్రపంచంతో మనం అనుసంధానం కావడానికి యోగా ఉపయోగపడుతుందన్నారు.
……………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
