
ఇరాన్ పై అమెరికా బాంబుల దాడి
* మూడు అణు కేంద్రాలపై దాడి
* మరిన్ని దాడులు ఉంటాయి ట్రంప్ హెచ్చరిక
* కచ్చితత్వం తో దాడి చేయగలిగాం
* ప్రపంచంలో ఏ సైన్యం ఇలా చేయ లేవు
* ఇరాన్ శాంతిని కోరుకోవాల్సిందే
ట్రంప్ హెచ్చరిక
ఆకరు న్యూస్, డెస్క్ : అందరూ ఊహించిన ట్లుగానే
జరిగింది. ఇరాన్ – ఇజ్రాయేల్ యుద్ధం లోకి అమెరికా ఎంట్రీ ఇచ్చింది.ఇరాన్ పై అమెరికా బాంబుల వర్షం కురిపించింది. ఫోర్డో, నటాంజ్, ఇస్సహానగ
అభికేంద్రాలపై బీ-2 స్పిరిట్ బాంబులతో
దాడి చేసింది. ఈ విషయం అమెరికా
అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియా
వేదికగా ప్రకటించారు.
ఇరాన్ తప్పనిసరిగా ఇక శాంతిని కోరుకోవాల్సిందే.. బాంబు దాడి చేసిన తర్వాత క్షేమంగా తిరిగి వచ్చాయని ట్రంప్ పేర్కొన్నారు..అమెరికా వారియర్స్ కు అభినందనలు తెలిపారు. ఇరాన్ శాంతి దిశగా ఆలోచించక పోతే మరిన్ని దాడులను చవి చూడాల్సిందే నని ట్రంప్ హెచ్చరించారు.. యుద్దం లోకి అమెరికా ప్రవేశంతో ఇరాన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ఎదురు చూస్తున్నారు..
————