Maripeda Lorry Accident
* ఆపకుండా వెళ్లిన లారీని వెంబడించి పట్టుకున్న స్థానికులు
* మరిపెడలో విషాద ఘటన..
అకేరు న్యూస్ మహబూబాబాద్ :మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్పై వెళ్తున్న రైతును లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.
దంటకుంట తండాకు చెందిన రైతు వెంకట్రామ్ (45) బైక్పై వెళ్తుండగా.. ఖమ్మం నుంచి వరంగల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకట్రామ్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ప్రమాదం జరిగిన వెంటనే లారీ డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీంతో స్థానికులు లారీని వెంబడించారు. ఎల్లంపేట స్టేజీ వద్ద లారీని అడ్డుకుని నిలిపివేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. లారీ డ్రైవర్ను అదుపులోకి తీసుకుని ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రైతు వెంకట్రామ్ మృతితో దంటకుంట తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు స్థానికులను కలచివేశాయి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
