Blackmailed With Private Photos, Woman Loses 27 Tolas of Gold in Hyderabad
* 27 తులాల బంగారం దోపిడీ
* 30వేల నగదు కూడా..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓ సంస్థలో పనిచేసే సమయంలో ఆ యువతికి అతడితో పరిచయం ఏర్పడింది. తీయని మాటలతో స్నేహం నటిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఆ పరిచయం ఆసరాగా చేసుకుని ఫొటోలు దిగాడు. డబ్బు అప్పుగా తీసుకున్నాడు. కొన్నాళ్లకు ఆ డబ్బు తిరిగి ఇవ్వమని యువతి అడగడంతో అసలూ రూపం బయటపెట్టాడు. డబ్బు ఇవ్వకపోగా ఫొటోలు బయటపెడతానంటూ ఆమె దగ్గర ఏకంగా 27 తులాల బంగారం దోచేశాడు. అయినా అతడి వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
* డబ్బు అప్పుతో మొదలుపెట్టి..
హైదరాబాద్‌కు చెందిన యువతి (24) ఫ్యాషన్ డిజైనర్‌గా ఓ సంస్థలో పని చేసేంది. సంస్థలో పని చేస్తుండగా బండారు అప్పలస్వామి అలియాస్ అఖిల్‌తో ఆమెకు వృత్తిలో భాగంగా పరిచయం ఏర్పడింది. కొన్ని కారణాల వల్ల ఆమె పని మానేసింది. అయినప్పటికీ ఇద్దరి మధ్య పరిచయం కొనసాగింది. ఈ నేపథ్యంలో కొద్ది రోజుల క్రితం ఆ యువతిని అఖిల్ రూ.30 వేలు అప్పు కావాలని అడిగాడు.
* స్నేహితుడని నమ్మితే..
కొన్నాళ్ల తర్వాత తిరిగి ఇచ్చేస్తానని చెప్పడంతో అతడు మంచి స్నేహితుడిగా నమ్మిన ఆమె డబ్బు ఇచ్చింది. ఆ సమయంలో ఆమెతో కలిసి కొన్ని ఫొటోలు దిగాడు. అప్పటి నుంచి ఫొటోలను బయటపెడతానని ఆమెను బెదిరిస్తూ డబ్బు అడిగేవాడు. తన వద్ద డబ్బు లేకపోవడంతో ఆమె బంగారం ఇచ్చేది. అలా పలు దఫాలుగా ఆమె నుంచి ఏకంగా 27 తులాల బంగారు ఆభరణాలను తీసుకున్నాడు. ఇంకా డబ్బు కావాలని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు డబ్బుతో పాటు నగదును తీసుకొని మోసం చేసినట్టు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
