* మంత్రి సీతక్క
* తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా
మల్లాడి రాంరెడ్డి నియామకం
ఆకేరు న్యూస్ ములుగు ః కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారందరికీ తప్పకుండా గుర్తింపు లభిస్తుందని మంత్రి సీతక్క అన్నారు.దానికి నిదర్శనం మల్లాడి రాంరెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి లభించడమే ఉదాహరణ అని అన్నారు. హైదరాబాద్ లో మంత్రి సీతక్క, ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, ఎంపీ పోరిక బలరాంనాయక్ లచేతుల మీదుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మల్లాడి రాంరెడ్డి కి నియామక పత్రాన్ని అందుజేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మల్లాడి రాంరెడ్డి కి అభినందనలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు, ఆదర్శాలకు అంకితమై, నీతి, నిజాయితీతో పనిచేయాలని ఆమె కోరారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మల్లాడి రాంరెడ్డి మాట్లాడుతూ ఒక క్రమశిక్షణ గల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పార్టీ అభ్యున్నతికి, పార్టీ ఆదేశాలకు అనుగుణంగా అహర్నిశలు కృషి చేస్తానన్నారు. పార్టీ సమావేశాలకు అందుబాటులో ఉంటూ, కాంగ్రెస్ పార్టీ పథకాలను నిజమైన అర్హులకు అందజేసేలా కృషి చేస్తానన్నారు. పార్టీ అభివృద్ధికి అహర్నిశలు పని చేసి అభివృద్ధి పథంలో నడుపుతూ నా శక్తి మేరకు పని చేస్తానని అన్నారు. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటి ప్రధాన కార్యదర్శి నియామకానికి కృషి చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మంత్రివర్యులు దనసరి సీతక్క టీపీసీసీ ప్రధాన కార్యదర్శిగా నియమించిన టీపీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ , నా పదవి కోసం కృషి చేసిన ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి గారికి, ఎంపీ పోరిక బలరాంనాయక్ గారికి, నా వెన్నంటే నిలిచి, నాకు ప్రతి విషయంలో అండగా నిలబడిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, శ్రేయోభిలాషులకు ధన్యావాదాలు రాంరెడ్డి తెలిపారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
