Zombie Reddy 2 Upendra New look
* వైల్డ్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ‘హనుమాన్’, ‘మిరాయ్’ చిత్రాలతో పాన్-ఇండియా విజయం సాధించిన సూపర్ హీరో తేజ సజ్జ, ప్రస్తుతం ‘జాంబీ రెడ్డి 2 NXT LVL’గా వస్తున్న ‘జాంబీ రెడ్డి’ సెకెండ్ పార్ట్‌లో నటిస్తున్నారు. ‘జాంబీ రెడ్డి’ క్రియేటర్ ప్రశాంత్ వర్మ ఈ సీక్వెల్‌కు క్రియేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సుపర్ణ్ ఎస్. వర్మ దర్శకుడిగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
‘హక్’, ‘రానా నాయుడు’, ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’ వంటి ప్రశంసలు అందుకున్న ప్రాజెక్ట్స్‌తో పాటు పలు సినిమాలు, వెబ్ సిరీస్‌లకు రచయితగా పనిచేసిన సుపర్ణ్ ఎస్. వర్మ.. ఈ ఫ్రాంచైజ్‌కు తనదైన ఇంటెన్స్ టచ్‌ను తీసుకొస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తేజ సజ్జా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది.
గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘మిరాయ్’ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. తేజ సజ్జా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ‘జాంబీ రెడ్డి 2’ టైటిల్ అనౌన్స్మెంట్ వీడియోకు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది.
* కీలక పాత్రలో ఉపేంద్ర..
ఈ సినిమాలో రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో నటిస్తున్నారు. షనాయా కపూర్ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం కానున్నారు. శుక్రవారం ఉపేంద్ర పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో ఉపేంద్రను ఇంతకుముందెన్నడూ చూడని వైల్డ్, ఫియర్స్, లార్జర్ దెన్ లైఫ్ అవతార్‌లో ప్రజెంట్ చేశారు.
భారీ చెట్టు కొమ్మకు తలకిందులుగా వేలాడుతూ.. ఒక చేతిలో పొడవైన ఆయుధాన్ని పట్టుకుని ఆయన కనిపించారు. రఫ్ లుక్, విరబోసుకున్న జుట్టు, ఇంటెన్స్ ఎక్స్ప్రెషన్తో ఉన్న ఈ లుక్.. ఈ క్యారెక్టర్ ఎవరు? అనే ఆసక్తిని పెంచుతోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
