Panchanama Web Series
* వారం రోజుల్లోనే 25 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్..
* జీ5లో దూసుకెళ్తున్న వెబ్ సిరీస్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : జీ5లో సెప్టెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ‘పంచనామా’ వెబ్ సిరీస్‌కు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ప్రముఖ నటుడు భరత్ శ్రీనివాసన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కేవలం వారం రోజుల్లోనే 25 మిలియన్ల డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసింది.
మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌కు ఉదయభాను నిర్మాత, షో రన్నర్‌గా వ్యవహరించారు. ఆరు ఎపిసోడ్స్‌తో వచ్చిన ‘పంచనామా’ మొదటి సీజన్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. అన్ని ఎపిసోడ్స్ ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సిరీస్‌ను ఎక్కువగా వీక్షిస్తున్నారు.
* మూడు హత్యలు.. ఒక్క క్లూ కూడా లేదు..
వరుసగా మూడు హత్యలు జరగడం, పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఒక్క క్లూ కూడా దొరక్కపోవడం, చివరకు ఈ హత్యల వెనుకున్న కారణాన్ని పోలీసులు తెలుసుకోవడం వంటి ఆసక్తికరమైన అంశాలతో ‘పంచనామా’ సిరీస్ తెరకెక్కింది. మొదటి సీజన్ క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఎండింగ్ చూస్తే ఇది ముగింపు కాదు.. మరో కథకు ఆరంభం అన్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే రెండో సీజన్ చూడాలన్న ఆసక్తిని కలిగించేలా మొదటి సీజన్‌ను తెరకెక్కించారు.
* భరత్ నటనకు ప్రశంసలు..
పోలీస్ ఇన్వెస్టిగేషన్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్లను ఇష్టపడే ప్రేక్షకులకు ‘పంచనామా’ ఆకట్టుకునేలా ఉంది. పోలీస్ ఆఫీసర్ పాత్రలో భరత్ శ్రీనివాసన్ తన నటనతో ఆకట్టుకున్నారు. భరత్‌ను కొత్త యాంగిల్లో చూపించేలా ఆయన పాత్రను రూపొందించారు. మోహన్ శ్రీవత్స మేకింగ్, నరేష్ కుమరన్ ఆర్ఆర్, సందీప్ కాంత్ కెమెరావర్క్ సిరీస్‌కు మరింత బలాన్ని చేకూర్చాయి.
మేధా రెడ్డి, శివాజీ రాజా, చరణ్ బాబు, రూపా లక్ష్మీ, రాధిక ప్రీతి, సూర్య, శ్రీజ తదితరులు పోషించిన పాత్రలు కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. క్రైమ్, సస్పెన్స్, ఇన్వెస్టిగేషన్, థ్రిల్లర్ అంశాలను ఇష్టపడే ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనతో ‘పంచనామా’ జీ5లో మంచి వ్యూస్‌ను సాధిస్తోంది. వారం రోజుల్లోనే 25 మిలియన్ల డిజిటల్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటడం ఈ సిరీస్‌కు లభిస్తున్న ఆదరణను తెలియజేస్తోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
