*వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
*పాలకుర్తి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సీపీ
* శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సీపీ పూజలు
ఆకేరు న్యూస్, జనగామ: నేరాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. బుధవారం పాలకుర్తి పోలీస్ స్టేషన్ ను సిపి సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పచ్చటి వాతావరణం చూసి సంతృప్తి చెందారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ లను తనిఖీ చేయడంలో భాగంగా పాలకుర్తి పోలీస్ స్టేషన్ ను సందర్శించామన్నారు. ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సిపి కి కేసులు, సమస్యలు వివరించారు. సీపీ వెంట జనగాం వెస్ట్ జోన్ డీసీపీ రాజ మహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ జానకిరామ్ రెడ్డి, ఎస్ఐ లు దూలం పవన్ కుమార్, మేకల లింగా రెడ్డి ఉన్నారు.
ఆలయంలో సీపీ పూజలు
పాలకుర్తి శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో వరంగల్ సీపీ సన్ ప్రీత్ సింగ్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీపీ సన్ ప్రీత్ సింగ్ ను ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు, అనంతరం స్వామి వారి శేష వస్త్రంతో ఘనంగా సన్మానించి, ప్రసాదం అందజేశారు. ఆలయ ఈవో సల్వాది మోహన్ బాబు, సూపరింటెండెంట్ కొత్తపల్లి వెంకటయ్య, ఆలయ అర్చకులు దేవగిరి లక్ష్మన్న, డివిఆర్ శర్మ, దేవగిరి అనిల్ కుమార్, మత్తగజం నాగరాజు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
