ఆకేరు న్యూస్, కోదాడః కోదాడ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన ఇద్దరు కోనసీమ జిల్లాకు చెందిన ఎస్సై అశోక్, కానిస్టేబుల్ వీరస్వామిగా గుర్తించారు. వీరు ప్రయాణిస్తున్న కారు వేగంగా ముందు వెళ్తున్న గుర్తుతెలియని వాహనాన్ని ఢో కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అతి వేగంగా వాహనం నడపడమే ప్రమాదానికి కారణం అని భావిస్తున్నారు. గురువారం తెల్లవారు జాము కావడంతో డ్రైవర్ నిద్రలేమి కూడా ఓ కారణం కావచ్చు అని భావిస్తున్నారు. ప్రమాదం గురించి తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. గాయ పడ్డ వారిని చికిత్స కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
……………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
