ఆకేరున్యూస్, కరీంనగర్ ః కరీంనగర్ ట్రాఫిక్ పోలీసులు ఇక వాహనదారులపై డేగ కన్ను వేయనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఎప్పటికప్పుడు చలాన్లు వేయనున్నారు.స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ పోలీసులు అన్ని సిగ్నల్స్ వద్ద సీసీ కెమరాలు ఏర్పాటు చేశారు. ఈ సీసీ కెమరాలు జూన్ 27 నుంచి పూర్తి స్థాయిలో వినియోగంలోకి రానున్నాయి.ఎవరైనా సిగ్నల్ జంప్ అయినా, రాంగ్ రూట్ లో వెళ్తున్నాసీసీ కెమరాల్లో కన్పిస్తుంది. అలాగే హెల్మెట్ లేకుండా వాహనాలను నడపడం, సీట్ బెల్ట్ లేకుండా ప్రయాణించడం లాంటివి ఇక ముందు చేయొద్దని కరీంనగర్ పోలీసులు పట్టణ ప్రజలకు సూచిస్తున్నారు. ట్రాఫిక్ నియమాలు పాటించి, ప్రమాదాలను నివారించాలని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని సూచిస్తున్నారు.
…………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
