* ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
ఆకేరు న్యూస్ ,అమరావతి ః సీఎం చంద్రబాబు విజన్ ప్లాన్ తో ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద అఖండ గోదావరీ ప్రాజెక్టుకు ఆయన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో కలిసి శంకుస్థాపన చేశారు.
రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని పవన్ అన్నారు. 2035 నాటికి ఏపీలో పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందని పవన్ అన్నారు. విదేశాల్లో నదీ తీరాల వెంబడి పర్యాటక కేంద్రాలు అభివృద్ధి చెందినట్లు రాష్ట్రంలో కూడా అదే విధంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ లో 974 కి.మీ నదీ తీరం ఉందని ఈ నదీ తీరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని పవన్ అన్నారు. కేంద్ర మంత్రి షెకావత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సహకరిస్తున్నారని విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ పరం కాకుండా షెకావత్ సహకరించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కందుల దుర్గేష్,నిమ్మల రామానాయుడు
ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి పాల్గొన్నారు.
………………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
