Published:
Updated: 26 Jun 2025 • 01:05 PM
* విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేసిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్ తాడ్వాయిః తాడ్వాయి మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్ ఇందిరానగర్ పాఠశాలలో విద్యార్థులకు పోలీసుల ఆధ్వర్యంలో (గంజాయి )మాదకద్రవ్యాల నియంత్రణ అనే అంశం పై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఇందులో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆ పాఠశాల విద్యార్థిని గూల్ల ప్రాణహిత కు ములుగు లో జరిగిన అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగ వ్యతిరేక దినోత్సవ కార్యక్రమంలో మంత్రి సీతక్క చేతులమీదుగా గోల్డ్ మెడల్, ప్రశంస పత్రాన్ని అందజేశారు. ఆమె వెంట స్థానిక ఎస్సై శ్రీకాంత్ రెడ్డి తదితరులున్నారు.
……………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
