-పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ఆకేరు న్యూస్, జనగామ: రైతు సంక్షేమం కోసమే కాంగ్రెస్ సర్కారు పనిచేస్తుందని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని రైతు వేదిక ప్రాంగణంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అందజేస్తున్న చిరు ధాన్యాలు విత్తనాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని మాట్లాడుతూ రైతులు నాణ్యమైన విత్తనాలను సకాలంలో పొందాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమన్నారు. ప్రతి మండలంలో వ్యవసాయ శాఖ సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ విత్తనాలను పంపిణీ చేస్తామని అన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ పథకాల ద్వారా మద్దతు అందిస్తోందని, రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, రైతులు, తగితరులు పాల్గొన్నారు.
…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
