హైదరాబాద్ లో భారీ పేలుడు * 13 మంది మృతి
* శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానాలు
* పేలుడు సమయంలో పరిశ్రమలో 90 మంది
* ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిలో 12 మంది పరిస్థితి విషమం
* మంత్రి దామోదర రాజనర్సింహ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ప్రమాదంలో మొత్తం 15 మంది కార్మికులు మృతి చెందినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja narasimha) తెలిపారు. శిథిలాల కింద నాలుగు మృతదేహాలు ఉన్నాయని అన్నారు. భవనం శిథిలాల కింద మరికొందరు ఉన్నట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. ప్రమాదం జరిగినప్పుడు పరిశ్రమలో 90 మంది ఉన్నట్లు వెల్లడించారు. సిగాచి పరిశ్రమ(Sigachi Industry)లో జరిగిన ఈ దుర్ఘటన అత్యంత విచారకరమని మంత్రి వాపోయారు. రియాక్టర్ పేలుడు ధాటికి మూడు అంతస్తుల భవనం కుప్పకూలిపోయిందన్నారు. 30 మందికి పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. 12 మంది ఐసీయూలో ఉన్నారని, వారందరికీ మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రస్తుతం వెంటిలేటర్‌పై చికిత్స అందుతోందన్నారు. మరో మంత్రి వినోద్ కుమార్ (Vinod kumar) కూడా ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రభుత్వంతో పాటు, యాజమాన్యంతో మాట్లాడి మృతుల కుటుంబాలకు మెరుగైన పరిహారం అందిస్తామని ప్రకటించారు.
———————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
