* బంగారు బోనం సమర్పణలో పాల్గొన్న జోగిని శ్యామలాదేవి
* 2009 నుంచి 15 ఏండ్లుగా బోనం సమర్పణ
ఆకేరు న్యూస్, కమలాపూర్ : ఆషాడ మాసం సందర్భంగా విజయవాడలోని కనకదుర్గమ్మ గుడికి ఆదివారం భక్తుల తాకిడి పెరిగింది. మధ్యాహ్నం హైదరాబాద్ మహంకాళి ఆలయ కమిటీ ఆద్వర్యంలో విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి చేరుకొన్న జోగినీలు వైభవంగా మేళ తాళాలు,డప్పు చప్పుళ్ళు,మధ్యన బంగారు బోనాన్ని సమర్పించారు. పోతరాజు వేషాలు, జోగిని శ్యామలాదేవి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.తెలంగాణకు చెందిన 150 మంది ఒగ్గు కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 15 ఏండ్లుగా బోనాన్ని సమర్పించే ఈ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నామని నిర్వాహకులు మీడియాతో అన్నారు.1948లో ప్లేగు వ్యాధి ప్రబడినప్పుడు నిజాం రాజు అమ్మవారిని వేడుకున్నాడని…. అదే సాంప్రదాయాన్ని ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని బోనాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు అన్నారు.

…………………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
