బుద్దవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ గా మల్లేపల్లి లక్ష్మయ్య
* రెండేళ్ళ పదవీ కాలం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బుద్దవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ గా సీనియర్ జర్నలిస్ట్ మల్లేపల్లి లక్ష్మయ్య నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ళ పాటు లక్ష్మయ్య పదవిలో కొనసాగుతారు. కాగా బీఆర్ ఎస్ పాలనా కాలంలో చేపట్టిన ఈ బుద్దవనం ప్రాజెక్ట్ స్పెషల్ఆఫీసర్గా లక్ష్మయ్య పని చేశారు. 2016 నుంచి 2024 వరకు లక్ష్మయ్య స్పెషల్ ఆఫీసర్‌గా కొనసాగారు. ఈ కాలంలో ఆయన బుద్దవనం ప్రాజెక్ట్ పూర్తి చేయడంలో క్రియా శీలక పాత్ర పోషించారు. అంతర్జాతీయ స్థాయిలో బుద్దవనం ప్రాజెక్ట్ గుర్తింపు పొందడంతో దేశ, విదేశాల పర్యాటకులు గణనీయంగా పెరిగారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మల్లెపల్లి లక్ష్మయ్య పలు పత్రికలల్లో జర్నలిస్ట్‌గా పనిచేశారు.
————————————
Please tell us what is wrong. Your report will be sent to the website team.
