
ఆకేరు న్యూస్ ములుగుః ములుగు ఏరియా ఆస్పత్రిలో బుధవారం అన్నదానం,పళ్లపంపిణీ కార్యక్రమం జరిగింది. పట్టణ కేంద్రానికి చెందిన పైడిమల్ల సునీల్ కుమార్ ,కవిత దంపతుల కుమారుడు పైడిమల్ల రమణ్ కుమార్ గౌడ్ గత సంవత్సరం అనారోగ్యంతో మృతిచెందాడు. బుధవారం రమణ కుమార్ జయంతి కావడంతో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు ప్రభుత్వ ఆస్పత్రిలో అన్నదానం చేసి రోగులకు పళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంజా సూర్య , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు, యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
………………………………………….