
* ఎలాన్ మస్క్ కు పెను ప్రమాదం ముందుంది
ఆకేరున్యూస్ డెస్క్ :
నాకు పెట్రోల్ కారే కావాలి పీటర్..ఎలక్ట్రిక్ కారు ఎవడికి కావాలి పీటర్.. ఎలాన్ మస్క్ బాధపడే రోజు వస్తుంది … ఎలాన్ కు ఎన్నో సబ్సిడీలు ఇచ్చాం.. మస్క్ డిపోర్టేషనా ఆలోచిస్తాను పీటర్ .. ఇలా ఓ ఇంటర్వ్యూలో ట్రంప్ చేసిన సంభాషణ.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , ఎలాన్ మస్క్ ఒకప్పుడు మంచి స్నేహితులు. ఎలాన్ మస్క్ నిర్వహిస్తున్న ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీకి ట్రంప్ ప్రభుత్వం అనేక రాయితీలు కూడా ఇచ్చింది. అయితే ఇటీవల ట్రంప్ కు ఎలాన్ మస్క్ కి మధ్య విభేదాలు వచ్చాయి . ఎలాన్ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టనున్నారనే ఊహాగానాలు వస్తున్నాయి. ఈ నేపధ్యంలో వైట్ హౌస్ కరస్పాండెంట్ పీటర్ ట్రంప్ తో ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ చేశాడు.. అధ్యక్ష హోదాలో ఉన్న ట్రంప్ పదే పదే పీటర్… పీటర్ అని సంబోదించడం ఆసక్తిగా మారింది. అధ్యక్ష హోదాలో ఉన్న వ్యక్తి అన్నిసార్లు అతని పేరు ఉచ్చరిస్తున్నాడంటే అతనికి ఓ ప్రత్యేకత ఉండాలి కదా.. ట్రంప్ అంతటి వాడు అన్ని సార్లు పీటర్.. పీటర్ అన్నాడంటే అసలు ఈ పీటర్ ఎవరో తెలుసుకునేందుకు గూగుల్ బాట పట్టారు నెటిజన్లు ..గతంలో కేసీఆర్ తెలంగాణ సీఎంగా ఉన్నప్పుడు ప్రెస్ కాన్ఫరెన్సుల్లో రాహుల్.. రాహుల్ అనే పేరు తరుచుగా విన్పించేది.. అప్పుడు ఎవరీ రాహుల్ అనే ఆసక్తి తెలుగు వారికి ఉండేది.. .
ఇంతకు ఎవరీ పీటర్,,?
పీటర్ డూసీ ఓ అమెరికన్ జర్నలిస్ట్..అతను ప్యాక్స్ న్యూస్ కు వైట్ హౌస్ కరస్పాండెంట్ గా పనిచేస్తున్నారు. పొలిటకల్ సైన్స్ లో పిజి పూర్తి చేసిన పీటర్ విద్యార్థి దశ నుండే జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాడు. జో బైడన్ అధ్యక్షుడిగా ఉన్న కాలంలో పీటర్ డూసీ వైట్ హౌస్ కరస్పాండెంట్ గా నియమించబడ్డాడు. వృత్తిని గౌరవించే పీటర్ నిక్కచ్చిగా మాట్లాడతారు..నిర్మోహమాటంగా ప్రశ్నఅడుగుతారు.. ఈ కారణంగానే ఆయన పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీతో ఘర్షణ పడటం ద్వారా అతను వెలుగులోకి వచ్చాడు .అంతే కాకుండా 2014లో ఆపరేషన్ ఒసామా బిన్ లాడెన్ లో కీలకపాత్ర పోషించిన మాజీ నేవీ సీల్ రాబర్ట్ జె. ఒనీల్ తో ఇంటర్వూ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. ఆ ఇంటర్వ్యూకు గతంలో ఎన్నడూ లేనంతగా రేటింగ్ వచ్చిందట. ఇదిలా ఉండగా ఓ సందర్భంలో పీటర్ డూసీ అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడన్ తో ఇలా అన్నారు. మీ జ్ఞాపకశక్తి లో చాలా లోపం ఉంది మీరు ప్రెసిడెంట్ గా కొనసాగగలరా అని ప్రశ్నించారట.. ఈ ప్రశ్నకు బైడన్ అసహనానికి గురై నా జ్ఞాపక శక్తిలో లోపం ఉంది కాబట్టే నీకు మాట్లాడే అవకాశం ఇచ్చాను అన్నారట..ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ని కూడా పీటర్ డూసీ ప్రభావితం చేశాడని అందుకే ట్రంప్ నోట పీటర్ ..అనే పిలుపు తరచుగా వస్తూ ఉంటుందని నెటిజన్లు అనుకుంటున్నారు.
…………………………………………………