
* అమ్మవారికి బంగారు బోనం సమర్పణ
ఆకేరు న్యూస్, న్యూఢిల్లీ : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బోనాల ఉత్సవాలు దేశ రాజధాని ఢిల్లీ(DELHI)లోనూ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏటా ఢిల్లీలోనూ లాల్ దర్వాజా సింహవాహిని (LAL DARWAZA SIMHAVAHINI) అమ్మవారి బోనాల ఉత్సవాలు ధూంధాంగా నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా తెలంగాణ గవర్నర్ జిష్ణు వర్మ (GOVERNOR JISHNU VERMA) చేతుల మీదుగా సోమవారం ప్రారంభమైన వేడుకలు మూడు రోజులుగా కొనసాగుతున్నాయి. తొలుత సింహవాహినీ ఆలయ కమిటీ సభ్యులు ఇండియా గేట్ (INDIA GATE)వద్ద అమ్మవారి ఘటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, 150 మంది సాంస్కృతిక శాఖ కళాకారులు సాంప్రదాయ పూర్వక డప్పుల మోతలు, పోతురాజుల ఆటలు, ఒగ్గుడోలు కళాకారుల నాట్యాలు, పూర్ణ కుంభాల మధ్య అమ్మవారి ఘటాల ఊరేగింపు నిర్వహించారు. ఇండియా గేట్ వద్ద జరిగిన ఈ వేడుకలు అక్కడికి వచ్చిన విదేశీయులను విశేషంగా ఆకర్షించాయి. చివరి రోజైన బుధవారం ఉదయం 11:00 గంటలకు అమ్మవారికి బంగారు బోనం సమర్పణ, సాంప్రదాయ పూజలు నిర్వహించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయతో పాటు మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. సాయంత్రం 6:00 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలతో బోనాల మహోత్సవ ముగింపు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
…………………………………………………..