
ఆకేరు న్యూస్, తాడ్వాయి: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తాడువాయి ఎటురునాగారం మార్గమధ్యలో జాతీయ రహదారిపై వారి వృక్షాలు పడిపోయాయి.మంగళవారం రాత్రి రోడ్డు పైన చెట్లు పడ్డాయన్న సమాచారం అందుకున్న వెంటనే తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్ రెడ్డి, ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని ఇర్ప నగేష్ సహకారం తో చెట్లను తొలగించి, ట్రాఫిక్ జామ్ ను క్రమబద్ధీకరించి వాహనాల రాకపోకలకు ఎలాంటి అంతరాయం లేకుండా క్లియర్ చేశారు. ఈ కార్యక్రమంలో తాడ్వాయి పోలీసు సిబ్బంది హెడ్ కానిస్టేబుల్
సత్య నారాయణ, పోలీస్ కానిస్టేబుళ్ల వెంకట్,రమేష్, సాంబ, రవీందర్ తదితరులు లు పాల్గొన్నారు.
……………………………………………….