
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా వెంకటాపూర్ మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ,ప్రాథమిక పాఠశాలను వరంగల్ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (RJD) సత్యనారాయణ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పాఠశాలలలో విద్యార్థిని, విద్యార్థులకు యూనిఫామ్స్, పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, టీచర్ల డైరీలు, మధ్యాహ్న భోజన రిజిస్టర్, అటెండెన్స్ రిజిస్టర్,బియ్యం స్టాక్ రిజిస్టర్,పాఠశాలలో నిర్వహిస్తున్న అన్ని రికార్డులతో పాటుగా లైబ్రరీ రూమ్, డిజిటల్ ప్యానల్ వివరాలు, సైన్స్ ల్యాబ్,కంప్యూటర్ ల్యాబ్, ప్రొజెక్టర్ వివరాలు, అడిగి తెలుసుకున్నారు. డార్మెంటరీ, కిచెన్ రూమ్స్ లను సందర్శిస్తూ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు.విద్యార్థుల సామర్థ్యాలకు సంబంధించి నిర్వహించిన లెర్నింగ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం(LIP) కి సంబంధించిన మూల్యాంకం పేపర్లను తక్షణమే ఆన్ లైన్ చేయాలని మండల విద్యా వనరుల కేంద్రం నుంచి తీసుకున్న పాఠ్యపుస్తకాలు,నోట్ బుక్స్,యూనిఫామ్ ల సమాచారాన్ని ఆన్ లైన్లో నమోదు చేయాలని సూచించారు.ఈ తనిఖీల్లో కార్యక్రమంలో ములుగు జిల్లా ప్లానింగ్ కోఆర్డినేటర్ అర్షం రాజు ,ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు టి. రాధిక ,సీనియర్ ఉపాధ్యాయులు జనగాం బాబురావు,ప్రాథమిక పాఠశాల ఇన్చార్జి ఉపాధ్యాయులు చిన్న కేశవరావు, టి.రాజయ్య, ఫిజికల్ డైరెక్టర్ బి.వేణు సి ఆర్ పి కుమార్ పాడ్య తదితరులు పాల్గొన్నారు.
……………………………………………