
ఎమ్మెల్సీ కవిత
* బీసీ నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలి
* బీసీ బిల్లు అమలు డిమండ్ చేస్తూ 17న రైలు రోకో
* తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీసీ రిజర్వేషన్లపై ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తానన్న సీఎం రేవంత్ ఇంకా తీసుకెళ్లలేదని, ఈనెల 8 లోపు ఢిల్లీకి తీసుకెళ్లాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (KAVITHA) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీసీ బిల్లుపై ఒత్తిడి తీసుకురావాలని ఏఐసీసీ చీఫ్ ఖర్గేకు లేఖ రాస్తామన్నారు. హైదరాబాద్(HYDERABAD)లోని తన నివాసంలో కవిత ఈరోజు మాట్లాడారు. బిసీ బిల్లును అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 17న తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రైలు రోకో (RAIL ROCO) చేపడతామన్నారు. ఈమేరకు సంబంధిత పోస్టర్ను ఆమె విడుదల చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఖర్గే హైదరాబాద్ వస్తున్నారని, బీసీలకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎలా వెళ్తారని ప్రశ్నించారు. ఖర్గే(KARGHE), రాహుల్ గాంధీ(RAHULGANDHI), సోనియా గాంధీ(SONIA GANDHI), ప్రియాంక గాంధీ (PRIYANKA GANDHI) బీసీల కోసం పార్లమెంట్లో ఎన్నడూ మాట్లాడలేదని మండిపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా బీజేపీపై ఖర్గే ఒత్తిడి తేవాలన్నారు. బీసీ బిల్లుపై బీజేపీ చొరవ తీసుకోవాలని, ఈ విషయమై ఆ పార్టీ నూతన అధ్యక్షుడు రామచందర్ రావుకు లేఖ రాశామని చెప్పారు. ఆయన చొరవ తీసుకోని బీజేపీ అధ్యక్ష హోదాలో తొలి విజయం నమోదు చేసుకోవాలని సూచించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ (CONGRESS) వైఖరిని తప్పుబట్టారు.
………………………………………………