
* ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
* కాకులమర్రి లక్ష్మణ్ బాబు
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లా చల్వాయి గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో అన్యాయాన్ని ప్రశ్నిస్తూ నిజమైన అర్హులైన పేదలకు ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రశ్నించిన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన చుక్కా రమేష్ మృతి కారణం అయిన నాయకులను కఠినంగా శిక్షంచాలని బి ఆర్ఎస్ ములుగు జిల్లా అధ్యక్షుడు కాకుల మర్రి లక్ష్మణ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లపై జరుగుతున్న తీరును ప్రశ్నించినందుకు కొంతమంది నాయకులు పోలీసులకు సమాచారం అందించి అతనిని బెదిరించి సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారన్నారు.మా నాయకుడు వచ్చాక నీ సంగతి చెప్తామని బెదిరించడంతో మనస్థాపానికి భయానికి గురి అయిన చుక్కా రమేష్ గురువారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రశ్నిస్తున్న వారిపై భౌతికదాడులు చెస్తు, బెదిరించి మానసికంగా ఇబ్బంది పెట్టి చంపుతున్న నాయకులపై జిల్లా ఎస్పీ కలెక్టర్ స్పందించి నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా చర్యలు తీసుకొని ఆ కుటుంబాని జిల్లా కలెక్టర్ ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట
బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
……………………………………………..