
ఆకేరు న్యూస్, తాడ్వాయి: ములుగు జిల్లా తాడువాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ దేవతల గద్దె లను దేవాదాయ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి సైలజ రామయ్యర్ గురువారం దర్శించుకున్నారు. ఆదివాసి ఆచార సంప్రదాయాలు ప్రకారం అమ్మ వారి గద్దెలపై పసుపు కుంకుమ బంగారం(బెల్లం)సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. కున్నారు అనంతరం దేవాలయం ప్రాంగణంలో జరుగుతున్న క్యూలైన్ లు పరిశీలించారు, జంపన్న వాగు, చిలుకలగుట్ట, కన్నెపల్లి లోని సారలమ్మ దేవాలయను సందర్శించారు. ప్రస్తుతం వచ్చే ఏడాదిలో జరుగు మహా జాతర ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అడ్వైసర్ గోవిందహరి, ఆర్డీఓ వెంకటేష్, దేవాదాయ రెవెన్యూ సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
……………………………………….