
– ప్రజలందరూ ప్రభుత్వ ఆసుపత్రిని ఉపయోగించుకోవాలి
– ఉచితంగా ఈసీజీ, ఎక్స్ రే ,రక్త, మూత్ర పరీక్షలు
– కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు
ఆకేరు న్యూస్, కమలాపూర్ : వర్షాకాలములో వాతావరణ పరిస్థితుల వల్ల సంక్రమించే జబ్బుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కమలాపూర్ ఎంపీడీవో గుండె బాబు అన్నారు.గురువారం మండలంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించి, ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లడం వలన రకరకాల పరీక్షల పేరుతో విపరీతమైన చార్జీలు వేస్తున్నారని, ప్రజలు కమలాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్సలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. గైనకాలజిస్ట్ ప్రతి సోమవారము, శనివారము అందుబాటులో ఉంటున్నారని మహిళలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలన్నారు, ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త, మూత్ర పరీక్షలతో పాటు ecg, ఎక్స్ రే తదితర అన్ని రకాల పరీక్షలు నిర్వహించడానికి నాణ్యమైన పరికరాలు ఉన్నాయని అన్నారు.ప్రజలు ఆరోగ్య రీత్యా కలిగే ఇబ్బందులకు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవాలని అన్నారు.కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ నరేష్, వైద్యులు,సిబ్బంది పాల్గొన్నారు.
………………………………………………….