
* లక్డీకాపూల్‌లో ఆవిష్కరించిన సీఎం రేవంత్, ఖర్గే
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి (Former Chief Minister) కొణిజేటి రోశయ్య విగ్రహాన్నిఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి లక్డీకాపూల్‌లో శుక్రవారం ఆవిష్కరించారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకట రెడ్డి, రోశయ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో 16సార్లు ఆర్థిక శాఖ మంత్రి హోదాలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోశయ్య (Rosaiah) దక్కించుకున్నారని కొనియాడారు. రోశయ్య జయంతి వేడుకలను అధికారికంగా నిర్వహించాలని తమ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందన్నారు. తమ ప్రభుత్వం అరుదైన గౌరవం ఆయనకు కల్పించిందని సీఎం పేర్కొన్నారు. రోశయ్య సుమారు 50 ఏళ్లు రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నా వివాదరహితుడిగా పేరు పొందారని రేవంత్ రెడ్డి తెలిపారు. తమిళనాడు గవర్నర్‌గా కూడా రోశయ్య సేవలందించారని వివరించారు. కాగా రోశయ్య 1933 జూలై 4న జన్మించగా, 2021 డిసెంబర్ 4న కన్నుమూశారు.
………………………………………..