
* పార్టీ పదవులను ఈజీగా తీసుకోవద్దు
* నాయకులుగా ఎదగాలంటే కష్టపడాలి
* కేంద్రం కులగణన చేసేలా ఒత్తిడి పెంచాం
* స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకే పెద్దపీట
ఆకేరున్యూస్ హైదరాబాద్ ః పార్టీలో పదవులు అనుభవిస్తున్నవారు ఆ పదవులను ఈజీగా తీసుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ భవన్ లో జరిగినకాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్సమావేశంలో రేవంత్ మాట్లాడారు. కార్యకర్త స్థాయి నుండి నాయకుల వరకు ప్రతీ ఒక్కరూ క్రమశిక్షణ కలిగి ఉండాలని సీఎం అన్నారు. పార్టీలో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరుగుతుందని సీఎం హామీ ఇచ్చారు. రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం సీట్లను కేటాయిండానికే కృషి చేస్తామన్నారు. రానున్న పదేళ్లూ కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. కులగణన నిర్వహించి కేంద్రం కులగణన చేపట్టేలా ఒత్తిడి తెచ్చామని రేవంత్ పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గాల పునర్విభజన కారణంగా అసెంబ్లీ,పార్లమెంట్ సీట్లు పెరుగుతాయన్నారు. అప్పడు ఇంకా ఎక్కువ మందికి అవకాశాలు లభిస్తాయన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేసి అత్యధిక స్థానాలు గెలవాలని సూచించారు. ఇన్ చార్జ్ మంత్రులు ప్రతీ విషయాన్ని సీరియస్గా తీసుకొనిపనిచేయాలని కోరారు. జూబ్లీ హిల్స్ ఉపెన్నికల్లో పార్టీ గెలుపునకు కృషిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ సభ్యత్వాలను పెంచేందుకు కృషిచేయాలని కోరారు. నూతన నాయకత్వం 2009లో జరుగనున్న ఎన్నికల్లో తమ సత్తా చాటాలని కోరారు. నూతన నాయకత్వానికి ఈ ఎన్నికలు ఓ వేదిక అవుతాయని రేవంత్ అన్నారు. పార్టీలో అంకిత భావంతో పని చేస్తే అత్యున్నత పదవి లభిస్తుందనడానికి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేనే ఉదాహరణ అని రేవంత్ అన్నారు. ఈ సమావేశంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, పార్టీ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
…………………………………………..