* జిల్లా ఎస్పీ శబరిష్.పి
ఆకేరు న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని ఈ నెల రోజుల (జూలై 4వ తేది నుండి 31 వరకు) పాటు జిల్లా వ్యాప్తంగా పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని ములుగు జిల్లా ఎస్పీ డాక్టర్ శబరీష్.పి తెలిపినారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. బంద్ ల పేరిట వివిధ కారణాలను చూపుతూ బలవంతంగా వివిధ సంస్థలు, కార్యాలయాలను మూసి వేయాలని ఒత్తిడి, బెదిరింపులకు గురిచేసే వారిపై చట్ట రీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పి సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ కు నిరంతరం శ్రమిస్తున్న పోలీసులకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలని సూచించారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
