
* రొటీన్ చెకప్ కోసమే ఆస్పత్రిలో
* కేసీఆర్ ఆరోగ్యంపై కేటీఆర్ వివరణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ (Kcr) ఆరోగ్యం బాగానే ఉందని, రొటీన్ హెల్త్ చెకప్‌లో భాగంగా నిన్న సాయంత్రం యశోదా ఆసుపత్రిలో చేరారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) తెలిపారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో పోస్టు చేశారు. ఆయన బ్లడ్ షుగర్, సోడియం లెవెల్స్ మానిటర్ చేయడం కోసం ఒకటి, రెండు రోజులు ఆసుపత్రిలో చేరాల్సిందిగా డాక్టర్లు సూచించారని అన్నారు. కేసీఆర్ ఆరోగ్యం సమాచారం అడుగుతూ, ఆయన క్షేమంగా ఉండాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
………………………………………………..