
*ఎంఎన్ సీ స్కాంలో వరంగల్ కొలంబో మెడికల్ కాలేజీ ట్రస్టీ కొమిరెడ్డి జోసఫ్
*సీబీఐ దర్యాప్తుతో వెలుగులోకి
*కొమిరెడ్డి జోసఫ్పై కేసు నమోదు చేసిన సీబీఐ
* దేశ వ్యాప్తంగా 36 మందిపై కేసు
* తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఐదుగురు
* అక్రమంగా వైద్య కళాశాల అనుమతులు పొందిన పలు కళాశాలలు
ఆకేరు న్యూస్, వరంగల్ ః నకిలీ రోగులు ,నకిలీ బోధకులు. నకిలీ డాక్టర్లు.. అంతా మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలా ఉంటుంది వ్యవహారం.. ఆ సినిమాలో హీరో తన తండ్రికి తాను డాక్టర్ ను అని నమ్మించడానికి అప్పటికప్పుడు హాస్పిటల్ సెట్టింగ్ వేసి నకిలీ డాక్లర్లతో,,నకిలీ రోగులతో హడావుడి చేస్తాడు..కాని ఇక్కడ వైద్యకళాశాలకు అనుమతి లేదా గుర్తింపు తెచ్చుకోవడానికి వైద్య కళాశాలల యాజమాన్యం శంకర్ దాదా సినిమా లెవల్ బిల్డప్ లే ఇచ్చారు. అక్రమ దారిలో అనుమతులు తెచ్చుకోవడానికి కనీస ప్రమాణాలు లేకున్నా అవినీతి అధికారులకు లంచం ఇచ్చి కళాశాలలకు గుర్తింపు తెచ్చుకున్నారు. సాధారణంగా వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చేందుకు లేదంటే ఉన్న వాటిని పునరుద్ధరించేందుకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులు ఆయా కళాశాలలను తనిఖీ చేసి కళాశాలలో వసతులను పరిశీలించి ,కళాశాలలు పాటిస్తున్న ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని సంతృప్తిగా ఉంటేనే ఆయా కళాశాలలకు అనుమతులు ఇస్తారు. కానీ అందుకు భిన్నంగా అడ్డదారుల్లో కళాశాలలకు అనుమతులు వస్తున్నాయన్న ఫిర్యాదుల మేరకు సీబీఐ రంగంలోకి దిగి దేశ వ్యాప్తంగా మొత్తం 36 మందిపై కేసు నమోదు చేసింది. అందులో చత్తీస్ ఘడ్ ,కర్నాటక,రాజస్థాన్, మధ్యప్రదేశ్,ఉత్తరప్రదేశ్ ,ఢిల్లీకి చెందిన వైద్య కళాశాలల తనిఖీల్లో ఈ అక్రమాలు బయటపడ్డాయి . ఈ వ్యవహారంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు ఐదుగురు ఉండగా అందులో వరంగల్ కు చెందిన ఫాదర్ కొలండా కళాశాల ట్రస్టీ కొమిరెడ్డి జోసఫ్ ఉన్నారు. ఫాదర్ కొలంబో మెడికల్ కాలేజ్ ట్రస్టీ కొమ్మారెడ్డి జోసఫ్ పై సీబీఐ కేసు నమోదు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన డాక్టర్ హరిప్రసాద్, అలాడే డాక్టర్ అంకం రాంబాబు,డాక్టర్ కృష్ణ కిషోర్, డాక్టర్ హరి ప్రసాద్, విశాఖ పట్టణంలోని గాయత్రి వైద్య కళాశాలకు చెందిన డాక్టర్ వెంకట్ ఢిల్లీకి చెందిన దళారి వీరేంద్రసింగ్ ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. దేశ వ్యాప్తంగా పలువురు దళారులు వైద్యకళాశాలలకు చెందిన ప్రతినిధులతో కమ్మక్కై అవినీతికి పాల్పడినట్లు కేసు నమోదయింది.ఈ దళారులు అంచాలు ఎరవేసి అధికారులను లోబరుచుకుంటారు. ఇందులో ఇందులో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన ఉద్యోగుల పాత్ర లేనిది ఈ పని చేయలేరు. సీబీఐ కేసు నమోదు చేసిన వారిలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకుచెందిన అధికారులు ఉన్నట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకుచెందిన పూనం మీనా,ధర్మవీర్,పీయుష్ మల్యాల్, అనూప్ జైస్వాల్,రాహుల్ శ్రీవాత్సవ,చందన్ కుమార్ లు ఉన్నట్లు సీబీఐ ప్రాథమికంగా గుర్తించింది. వీరంతా పెద్ద మొత్తంలో లంచాలు తీసుకొని ఎన్ ఎంసీ అధికారులు ఎవరెవరు వస్తున్నారు ఎప్పుడు వస్తున్నారనే విషయాన్ని ఆయా కళాశాలలకు మందుగానే చేరవేసే వారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న ఆయా కళాశాలల యాజమాన్యం నకిలీ డాక్టర్లు. నకిలీ రోగులతో నానా హంగామా చేసి లంచాలు ఇచ్చి కళాశాలలకు అనుమతులు పొందిన తీరు ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నేసనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులను బుట్టలో వేసుకొని వారికి కావలిసిన అనుమతులు పొందే వారు. ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన డాక్టర్ హరి ప్రసాద్ తాను వైద్య కళాశాలలకు కన్సల్టెంట్ ను అని చెప్పుకునే వారు. అలాగే డాక్టర్ అంకం రాంబాబు,డాక్టర్ కృష్ణ కిశోర్ లు ఆయనకు సహకరించేవారు ఇదిలా ఉండగా మెడికల్ కాలేజిల తనిఖీల కోసం కొలంబో ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ట్రస్టీ కొమిరెడ్డి కి విశాఖ గాయత్రి మెడికల్ కాలేజీ డైరెక్టర్ నుంచి 50 లక్షలు అందినట్లు విచారణలో తేలింది. ఆ డబ్బును డాక్టర్ కృష్ణ కిశోర్ ద్వారాఢిల్లీకి హవాలా రూపంలో తరలించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు. సీబీఐ దర్యాప్తులో భాగంగా తీగలాగితే డొంకంతా కదిలినట్లు ఈ వ్యవహారంలో వరంగల్ కు చెందిన కొమిరెడ్డి జోసఫ్ పేరు బయట పడింది.
……………………………………………………..